ఏపీ హైకోర్టులో పీఎస్ఆర్ మరో పిటిషన్‌

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-20 16:51:44  IST  )

ఏపీ హైకోర్టులో ఐపీఎస్‌ పీఎస్ఆర్ మరో పిటిషన్‌ దాఖలు చేశారు...

ఏపీ హైకోర్టులో పీఎస్ఆర్ మరో పిటిషన్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ గ్రూప్-1(APPSC Group-1) జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(IPS officer PSR Anjaneyulu) మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ హైకోర్టు(AP High Court)లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన మధ్యంతర బెయిల్‌(Interim Bail)ను పొడిగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను శని లేదా సోమవారం స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా పీఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత జవాబు పత్రాల మూల్యాంకనం జరిగింది. అయితే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

అయితే జైలులో తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ మేరకు వైద్యులు సైతం రిపోర్టులు ఇచ్చారు. దీంతో పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఈ నెల 27 వరకూ ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో వారంలో ఈ గడువు ముగియనుంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరారు.

మరోవైపు ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ శుక్రవారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు నెంబర్ కేటాయించిన అనంతరం విచారణ జరిపే అవకాశం ఉంది.

Next Story