ఐపీఎస్ పీఎస్ఆర్‌కు ఊరట.. బెయిల్ గడువు పొడిగింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-26 17:00:44  IST  )

ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు మరోసారి కూడా ఊరట లభించింది...

ఐపీఎస్ పీఎస్ఆర్‌కు ఊరట.. బెయిల్ గడువు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు(IPS PSR Anjaneyulu)కు మరోసారి కూడా ఊరట లభించింది. ఆయన మధ్యంతర బెయిల్‌(Interim bail)ను పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పేపర్ మూల్యాంకనం(APPSC Group-1 Paper Evaluation)లో అవకతవకలు జరిగిన కేసులో ఆయన అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. జైలులో అనారోగ్యం పాలుకావడంతో పీఎస్‌ఆర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. వైద్యం కోసం 2 నెలల పాటు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆయన బెయిల్ గడువు ముగిసింది. దీంతో మధ్యంతర బెయిల్ పొడిగింపుతో పాటు రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను బైపాస్ సర్జరీ చేయించున్నానని కోర్టుకు తెలిపారు. పీఎస్ఆర్ అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం మధ్యంతర బెయిల్ గడువును పొడిగిస్తూ ఆదేశించింది.

Next Story