- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ips అధికారి సంజయ్‌కు దెబ్బ మీద దెబ్బ.. రెండు రోజుల కస్టడీకి అనుమతి
Ips అధికారి సంజయ్‌కు బిగ్ షాక్ తగిలింది..

దిశ, వెబ్ డెస్క్: Ips అధికారి సంజయ్(IPS officer Sanjay)కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. రెండు రోజుల కస్టడీ(Custody)కి విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మరింత లోతు విచారణ చేయాలని, ఈ మేరకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు(ACB officials) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐపీఎస్ అధికారి సంజయ్‌ను రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే అంతకుముందు సంజయ్‌కు ఇదే కోర్టులో బిగ్ షాక్ తగిలింది. తన రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. గతంలో సంజయ్ బెయిల్ రద్దు కావడంతో ఆయనను జుడీషియల్ రిమాండ్ కు తీసుకున్నారు. తాజాగా రిమాండ్ పొడిగించడం, అలాగే కస్టడీకి ఇవ్వడం రెండు జరగడంతో ఈ రోజే ఆయనకు వరుస దెబ్బలు తగిలాయి.






