- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.2.5 కోట్ల విలువైన ఐఫోన్స్ ఎత్తుకెళ్లి.. 24 గంటల్లో చిక్కారు..
కోట్ల విలువైన ఫోన్లు, లాప్టాప్లు చోరీ చేసిన నిందితులు 24 గంటల్లో దొరికిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కోట్ల విలువైన ఫోన్లు, లాప్టాప్లు చోరీ చేసిన నిందితులు 24 గంటల్లో దొరికిపోయారు. విజయవాడ రూరల్ఎనికేపాడులో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ముడు రోజుల కిందట ఎలక్ట్రానిక్స్ గోడౌన్ లో ఈ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. రూ.2.5 కోట్ల విలువైన ఐఫోన్స్, ల్యాప్ ట్యాప్ లను చోరీ చేశారు. వీటిలో 171 యాపిల్ ఐఫోన్లు, 75 యాపిల్ ఇయర్ బడ్స్, రెండు ఐప్యాడ్‌లను గోడౌన్ పై కప్పు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. గోడౌన్ సీసీ కెమెరాల దిశ మార్చారు. వారం కిందట ఈ గ్యాంగ్ఏపీకి వచ్చి రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు 100 కు పైగా సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేశారు. దొంగలు బీహార్ కు పారిపోతుండగా పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు






