నరసరావుపేటలో రూ.400 కోట్లకు ఐపీ..? సంచలనంగా మారిన ‘దిశ’ కథనం

by Ramesh Goud |

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో నలుగురు ప్రముఖ వ్యాపారులు రూ.400 కోట్లకు ఐపీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

నరసరావుపేటలో రూ.400 కోట్లకు ఐపీ..? సంచలనంగా మారిన ‘దిశ’ కథనం
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో నలుగురు ప్రముఖ వ్యాపారులు రూ.400 కోట్లకు ఐపీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నలుగురూ నగరంలో ప్రముఖులే. అన్ని రకాల వ్యాపారాల్లోనూ ఉన్నారు. పలు వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగానూ ఉన్నారు. డాల్, ఆయిల్ మిల్లులు, చిట్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ప్రముఖులుగా పేరు పొందారు. పట్టణంలో ఆ నలుగురికీ చెప్పుకోదగ్గ విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువైనట్లు సమాచారం. అప్పులిచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఐపీ పెట్టి అప్పుల బారి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కొందరు తమ డబ్బుల విషయంలో తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్టు సమాచారం..

‘దిశ’ కథనంతో..

పట్టణంలో ఇద్దరు ప్రముఖ వ్యాపారులు ఐపీ పెట్టనున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ‘దిశ’లో ప్రచురితమైన వార్త పట్టణంలో సంచలనంగా మారింది. సాయంత్రానికి మరో ఇద్దరు వ్యాపారులు కూడా ఐపీ పెడతారని ప్రచారం ప్రారంభమైంది. దీంతో రూ.250 కాదు.. మొత్తం రూ.400 కోట్లకు ఎగనామం పెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. ఏక్షణమైనా బిచాణా ఎత్తేసే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళనలో మునిగిపోయాయి. ఒకరిద్దరు ప్రకాష్‌నగర్‌లోని న్యాయవాది ద్వారా సమస్య నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సినీ ఫైనాన్స్ చేసే ఓ వ్యాపార సంస్థ అధిపతి పరిస్థితి కూడా డోలాయామానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో ప్రముఖుడు కూడా చిన్న వ్యాపారుల వద్ద తీసుకొని పెద్దవాళ్ళకు అప్పులిస్తుంటాడు. ఈ ప్రముఖుల ఆర్థిక లావాదేవీల విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు తమ డబ్బుల విషయంలో తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.

Next Story