అమరావతి ఆహ్వాన పత్రిక రివీల్.. ప్రధాని మోడీతో పాటు ఎవరెవరి పేర్లున్నాయో తెలుసా?

by Yella Dhawani Reddy |

ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనులు మే 2వ తేదీన ప్రధాని మోడీ (PM Modi) చేతుల మీదుగా పున:ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

అమరావతి ఆహ్వాన పత్రిక రివీల్.. ప్రధాని మోడీతో పాటు ఎవరెవరి పేర్లున్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనులు మే 2వ తేదీన ప్రధాని మోడీ (PM Modi) చేతుల మీదుగా పున:ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సుమారు లక్ష కోట్ల రూపాయల నిధులతో వివిధ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆహ్వాన పత్రికలను (Special invitation card) రూపొందించింది. అమరావతి ప్రజారాజధాని పున: ప్రారంభం పేరుతో వీటిని రెడీ చేసి, అతిథులకు అందజేసి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది.

గత పదేళ్లగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీ దశ, దిశ తిరుగుతుందనేదానికి సంకేతంగా ఈ ఆహ్వాన పత్రికను డిజైన్ చేశారు. పత్రికపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పేర్లతో పాటు అమరావతి స్థూపం, అమరావతి నగర ఊహాచిత్రంతో రూపొందించారు. ఇక ఈ పత్రికలను రాజధాని రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పంపుతున్నారు. శంకుస్థాపన అనంతరం సుమారు 5 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఇక ఆ రోజు ప్రధాని మోడీ కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రధాని బయలుదేరుతారు. 2:50 గంటలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుం టారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.45 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని గంట 15 నిమిషాలు అమరావతిలో గడుపుతారు. అనంతరం ఆయన విజయవాడ విమానాశ్రయం చేరుకుని, సాయంత్రం 5:20 గంటలకు ఢిల్లీకి పయనవుతారు.

Next Story