ఈ స్టాంప్ స్కాంపై విచారణ ముమ్మరం.. నిందితుల బ్యాంకు ఖాతాల పరిశీలన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-27 05:19:22  IST  )

అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ-స్టాంపు కుంభకోణంపై విచారణ ముమ్మరం చేశారు...

ఈ స్టాంప్ స్కాంపై విచారణ ముమ్మరం.. నిందితుల బ్యాంకు ఖాతాల పరిశీలన
X

దిశ, వెబ్ డెస్క్: ఈ-స్టాంపు కుంభకోణం(E-stamp scam) అనంతపురం జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనంతపురం(Anantapur) టుటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కల్యాణదుర్గం పీఎస్(Kalyanadurgam PS)కు బదిలీ అయింది. దీంతో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులు ఎర్రప్ప, మోహన్‌తో పాటు మరో ఇద్దరి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. నిందితుడు ఎర్రప్ప జారీ చేసిన ఈస్ట్రాంపులు, ప్రభుత్వానికి జమ అయిన నగదులో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఎర్రప్ప మొత్తం 13 వేల ఈ స్టాంపులను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

కాగా మూడు, నాలుగు రోజులుగా ఈ స్ట్రాంగ్ కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Satya Prasad, the minister)స్పందించారు. ఈ స్ట్రాంప్ కుంభకోణంపై విచారణ జరపాలని రెవెన్యూ, స్ట్రాంపు రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టాంపు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

Next Story