ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో విచారణ వేగవంతం.. ఆ ఇద్దరినీ కస్టడీకి కోరిన సిట్

by Kema Shiva Kumar |

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసు (AP Liquor Scam Case)లో అరెస్ట్ అయిన CMO మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్‌ కె.ధనుంజయ రెడ్డి (A31), OSD కృష్ణమోహన్‌ రెడ్డి (A32)లను సీఐడీ అధికారులు విచారణ నిమిత్తం ఇవాళ విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు (ABC Court)కు తరలించారు.

ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో విచారణ వేగవంతం.. ఆ ఇద్దరినీ కస్టడీకి కోరిన సిట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసు (AP Liquor Scam Case)లో అరెస్ట్ అయిన CMO మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్‌ కె.ధనుంజయ రెడ్డి (A31), OSD కృష్ణమోహన్‌ రెడ్డి (A32)లను సీఐడీ అధికారులు విచారణ నిమిత్తం ఇవాళ విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు (ABC Court)కు తరలించారు. మందుగా ఆ ఇద్దరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు సిట్ అధికారులు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి నుంచి కేసులో మరిన్ని వివరాలు, ఆధారాలను సేకరించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. ఇద్దరిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు. అందులో ప్రధాన నిందితుడు రాజ్‌ కేసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్‌, గోవిందప్ప, బాలాజీలు ఉన్నారు. శుక్రవారం రాత్రి అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిలు కూడా కేసులో అత్యంత కీలక వ్యవహరించినట్లుగా సిట్ విచారణలో బట్టబయలైంది.

Next Story