- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆడుదాం ఆంధ్ర’ అవకతవకలపై విచారణ షురూ.. ‘శాప్’ ఆఫీస్‌లో విజిలెన్స్ దాడులు
by Kema Shiva Kumar |
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. శనివారం ఉదయం నుంచి శాప్ అధికారులను విజిలెన్స్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం టోర్నమెంట్ నిర్వహించి భారీగా నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నిధుల విషయంలో శాప్ అధికారుల పాత్రపై విచారణ చేపట్టారు. ఆడుదాం ఆంధ్ర దొంగలను వదిలేదే లేదని పలుమార్లు కూటమి నాయకులు హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి శాప్ ప్రధాన కార్యాలయంలో స్పోర్ట్స్ ఆఫీసర్లతో పాటు అప్పటి ఏవో రామకృష్ణని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.
Next Story






