ఫేక్, మ్యూల్ అకౌంట్ల ద్వారా బ్యాంకులకు టోకరా

by Naga Rani Yarlagadda |

నకిలీ, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా వివిధ బ్యాంకులకు ఏకంగా రూ.5.28 కోట్లు టోకరా వేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు నీలం పవన్ కుమార్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

ఫేక్, మ్యూల్ అకౌంట్ల ద్వారా బ్యాంకులకు టోకరా
X

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా వివిధ బ్యాంకులకు ఏకంగా రూ.5.28 కోట్లు టోకరా వేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు నీలం పవన్ కుమార్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అమాయకుల గుర్తింపు కార్డుల్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల రుణాలను కొల్లగొట్టిన ఈ కేటుగాడి వ్యవహారం నగరంలో తీవ్ర సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పవన్ కుమార్ ఇతరులకు చెందిన ఆధార్, పాన్ కార్డుల్ని అక్రమంగా సేకరించి, వాటిని దుర్వినియోగం చేస్తూ దొంగచూటుగా బ్యాంక్ అకౌంట్లను తెరిచాడు. 2019 నుంచి ఇప్పటి వరకూ పవన్.. 26 నకిలీ, మ్యూల్ సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేసి,... వాటి నుంచి క్రెడిట్ కార్డులను పొంది.. వాటి ద్వారా బ్యాంకుల నుంచి రూ.5.28 కోట్ల లోన్లు తీసుకుని.. బోర్డు తిప్పేశాడు. లోన్ పేమెంట్లు చెల్లించకపోవడంతో బ్యాంకులు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో పోలీసులు పక్కా ప్లాన్ తో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతని ఇంట్లో సోదాలు చేయగా.. పవన్ వద్ద నుంచి సుమారు రూ.7 కోట్ల విలువైన 34 ఆస్తి పత్రాలను, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి 26 సేవింగ్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకున్నాడు. గతంలో గూడూరు, బందర్ టౌన్, భవానీపురం, కృష్ణలంక పీఎస్ లలోనూ నిందితుడిపై కేసులు నమోదయ్యాయి.

Next Story