వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ : మంత్రి నారాయణ

by Thanuru Gopichand |

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) అన్నారు.

వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను గ్రామంలో నూతనంగా రోడ్డును నిర్మించారు. బీటీ రోడ్డు ప్రారంభోత్సవాన్ని (BT Road Inaugration) సోమవారం నిర్వహించారు. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. రోడ్డును ప్రారంభించిన రాకపోకలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వారం రెండో విడత భూ సమీకరణలో భాగంగా తాను వడ్డమాను గ్రామానికి వచ్చిన విషయం గుర్తు చేశారు. ఆ సమయంలో గ్రామస్తులు రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వీలైనంత త్వరగా రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చామన్నారు. చెప్పినట్లుగానే కేవలం వారం వ్యవధిలో రోడ్డు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. గతంలో తుళ్లూరు నుంచి వడ్డమాను వరకు రోడ్డు దారుణంగా ఉండేదన్నారు. గ్రామస్తుల వినతి మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతేకాకుండా కేవలం వారం వ్యవధిలో రోడ్డు పనులు పూర్తి చేయించానని చెప్పారు.

రెండో విడత భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. రూ.900ల కోట్ల వ్యయంతో పనులను చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పనులను ప్రారంభిస్తామన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో రాజధాని గ్రామాల్లో పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.

25న వాజ్ పేయీ విగ్రహావిష్కరణ

అనంతరం వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాంతంలో మంత్రి పర్యటించారు. అక్కడ జరుగుతున్న వాజ్ పేయీ విగ్రహ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. డిసెంబర్ 25న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్రమంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలను చేశారు.

Next Story