- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ తెలుగు మహాసభలకు అంతర్జాతీయ గౌరవం
మారిషస్ రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్.ఈ. ధర్మ్ బీర్ గోఖూల్‌కు శనివారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మారిషస్ రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్.ఈ. ధర్మ్ బీర్ గోఖూల్‌కు శనివారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ఆయనకు పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. జనవరి 3 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో మారిషస్ అధ్యక్షుడి పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ తెలుగు మహాసభలతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
తెలుగు భాషకు లభించిన అంతర్జాతీయ గౌరవం
తెలుగు భాష, సంస్కృతులతో విడదీయలేని అనుబంధం కలిగిన మారిషస్ దేశాధినేత రాక రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు హాజరు కావడం తెలుగు భాషకు లభించిన అంతర్జాతీయ గౌరవంగా అభివర్ణించారు. హెచ్.ఈ. ధర్మ్ బీర్ గోఖూల్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఆయన పాల్గొనే కార్యక్రమాలు తెలుగు భాషాభివృద్ధికి మరింత దోహదపడతాయని మంత్రి దుర్గేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.






