జనసేనలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

by Vemula.Srinu Prasad |

ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశం ఈ వివాదానికి కేంద్రబిందువైంది....

జనసేనలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) జనసేన(Janasena) పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Former Minsiter Balineni Srinivasareddy) ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశం(Delimitation meeting) ఈ వివాదానికి కేంద్రబిందువైంది. జిల్లా జనసేన అధ్యక్షుడు, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్‌(OUDA Chairman Sheikh Riaz)కు ఈ కీలక సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపిస్తూ రియాజ్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు అమ్ముడుపోయారంటూ రియాజ్ వర్గం తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కోసం కష్టపడే వారికంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

బాలినేని వర్సెసె రియాజ్ వర్గాలు

కాగా బాలినేని వర్సెసె రియాజ్ వర్గాల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు జనసేన అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో, సొంత పార్టీ నేతల మధ్య ఇలాంటి విభేదాలు బయటపడటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసి జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Next Story