- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణపై కీలక ప్రకటన విడుదల చేసింది. మార్చి 2026లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అనుతీర్ణులైన లేదా హాజరు కాలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి.రంజిత్ బాషా వెల్లడించారు. ..

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణపై కీలక ప్రకటన విడుదల చేసింది. మార్చి 2026లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అనుతీర్ణులైన లేదా హాజరు కాలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి.రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు ఒకే అవకాశంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 2026 పరీక్షలకు హాజరుకావచ్చని స్పష్టం చేశారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ఫెయిల్ అయినా లేదా పరీక్షలకు హాజరు కాలేకపోయినా, ఈ సప్లిమెంటరీ పరీక్షలకు అర్హులని తెలిపారు. అవసరమైతే ప్రాక్టికల్ పరీక్షలు కూడా రాయవచ్చని పేర్కొన్నారు. ఫీజుల విషయానికి వస్తే, ప్రతి సబ్జెక్టుకు రూ.160 చెల్లించాల్సి ఉంటుందని, పూర్తి సప్లిమెంటరీ పరీక్షకు జనరల్ కోర్సు విద్యార్థులు రూ.600, వృత్తి కోర్సు విద్యార్థులు రూ.1200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు స్వీకరించబడతాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






