- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర పరిణామం
ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్(AP Cabinet)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)ను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ప్రత్యేకంగా అభినందించారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో సహా వీడియోలు తీయించానని పవన్ కేబినెట్‌లో ప్రస్తావించారు.. దీంతో పవన్ పనితీరును సీఎం చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసించారు. అంతకుముందు మంత్రులను కూడా సీఎం చంద్రబాబు అభినందించారు. మొంథా తుపాన్ సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పని చేశారని కితాబిచ్చారు. అందరూ ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ అభినందనలు తెలిపారు. ఈ కేబినెట్ సమావేశం దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.






