‘ఆయన రియల్ లైఫ్‌లోనూ హీరోనే’.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-31 08:18:44  IST  )

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former Cm YS Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఆయన రియల్ లైఫ్‌లోనూ హీరోనే’.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former Cm YS Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(మే 31)న హీరో సూపర్ స్టార్ కృష్ణా(Super Star Krishna) జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ‘‘సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాత‌గా, ద‌ర్శకుడిగా, ఎడిట‌ర్‌గా, స్టూడియో అధినేత‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజ‌కీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story