DCM:చరిత్ర సృష్టించిన టీమిండియా.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-10 06:37:37  IST  )

ICC ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy-2025)లో విజేత‌గా భార‌త్ జట్టు నిలిచింది.

DCM:చరిత్ర సృష్టించిన టీమిండియా.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ICC ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy-2025)లో విజేత‌గా భార‌త్ జట్టు నిలిచింది. నిన్న(ఆదివారం) దుబాయ్(Dubai) వేదిక‌గా న్యూజిలాండ్‌(New Zealand)తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్(India) విజయం సాధించడంతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా(Team India) ఛాంపియన్ గా గెలుపొందడంతో సర్వత్రా అభినందనల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) టీమిండియా విజయం పై స్పందించారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని గెలుచుకున్నందుకు ‘‘కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా’’ అంటూ సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీ మొత్తం టీమిండియా ఆటతీరు అద్వితీయం అని అభివర్ణించారు. అన్ని రంగాల్లోనూ టీమిండియా(Team India) నైపుణ్యం ప్రదర్శించిందని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొనియాడారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడం జట్టు అంకితభావానికి, ప్రతిభకు నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ ఆకాంక్షించారు.

Next Story