NBK: నేనెందుకు పట్టించుకోవాలి.. నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)పై తప్పుడు ప్రచారం చేస్తున్నదెవరో అందరికీ తెలుసని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అన్నారు.

NBK: నేనెందుకు పట్టించుకోవాలి.. నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)పై తప్పుడు ప్రచారం చేస్తున్నదెవరో అందరికీ తెలుసని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన బాలకృష్ణ.. అక్కడ మీడియాతో మాట్లాడారు. షర్మిలపై అసత్య ప్రచారాన్ని వాళ్లు పట్టించుకోనప్పుడు.. తాను ఎందుకు పట్టించుకోవాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు ప్రభాస్‌(Prabhas)తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేశారు. తనపై బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందంటూ ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని మండిపడ్డారు. ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారని ఆవేదన చెందారు. పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా ప్రభాస్ ఎవరో తనకు తెలియదని షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story