ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ హాల్ టికెట్స్ రేపే విడుదల

by Ajay Maddhiboyina |

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ హాల్ టికెట్స్ రేపే విడుదల
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంట‌ర్మీడియ‌ట్ (Intermediate) ఫ‌లితాలు ఇప్ప‌టికే విడుద‌లైన సంగతి తెలిసిందే. పరీక్ష‌ల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు ఏపీ ఇంట‌ర్ బోర్డు (AP inter board) సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రేపు హాల్ టికెట్లు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు బోర్డు ప్ర‌క‌టించింది. మే 6వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు వెబ్ సైటులో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. విద్యార్థులు త‌మ హాల్ టికెట్ల‌ను రెగ్యుల‌ర్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబ‌ర్ లేదా ఆధార్ కార్డు నంబ‌ర్, పుట్టిన తేదీ ఎంట‌ర్ చేసి పొంద‌వ‌చ్చని తెలిపింది. మ‌న మిత్ర యాప్ ద్వారా లేదా వాట్సాప్ నంబ‌ర్ (9552300009) ద్వారా కూడా పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వ‌ర‌కు పరీక్ష‌లు నిర్వ‌హించనున్నారు. రెండు షిఫ్టుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.

Next Story