- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గండికోటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అత్యాచారం చేసి చంపేశారా?
ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎర్రగుంట మండలానికి చెందిన బాధిత విద్యార్థిని ప్రొద్దుటూరులో ఇంటర్ చదువుతోంది. రోజూ మాదిరిగానే సోమవారం (జులై 14) కాలేజీకి వెళ్లిన కూతురు పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. విద్యార్థిని ఆచూకీ కోసం గాలిస్తుండగా గండికోటలో గుర్తుతెలియని విద్యార్థిని మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మిస్సైన విద్యార్థినే మరణించినట్లు నిర్థారించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద రీతిలో ఉండటంతో.. ఆమెపై అత్యాచారం జరిగిందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీకి బయల్దేరిన యువతి లోకేష్ అనే యువకుడితో గండికోట వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజనిజాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.






