- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్
షాకింగ్ సంఘటన నుంచి తేరుకోని కుటుంబ సభ్యులు.

దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్ చదువుతున్న విద్యార్థిని (Inter Student) కిడ్నాప్ (Kidnap) కు గురైన సంఘటన మంగళగిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మంగళగిరి (Mangalagiri) పరిధిలో బాధిత కుటుంబం నివసిస్తోంది. కుటుంబానికి చెందిన బాలిక విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ప్రతిరోజూ కాలేజీకి ఇంటి వద్ద నుంచి రాకపోకలను సాగిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థితో కరాటే మాస్టర్ రవితేజ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. జనవరి 2న మామమాటలు చెప్పి కురగల్లుకు తీసుకెళ్లాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను కురగల్లు నుంచి మంగళగిరికి తీసుకొచ్చారు. అయితే శనివారం సాయంత్రం బైకులపై వచ్చి విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. షాక్ నుంచి కోలుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని.. తమ బిడ్డను కాపాడాలని.. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






