ప్రేమకు రూపురేఖలు అడ్డుకావు.. మచిలీపట్నంలో ఆదర్శ ప్రేమ వివాహం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-07 09:13:14  IST  )

ప్రేమకు రూపురేఖలు, కుల మతాలు, అందచందాలు అడ్డుకావని నిరూపించిందో జంట. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

ప్రేమకు రూపురేఖలు అడ్డుకావు.. మచిలీపట్నంలో ఆదర్శ ప్రేమ వివాహం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమకు రూపురేఖలు, అందచందాలు, కులమతాలు, పొట్టిపొడుగు వంటి వాటితో సంబంధం లేదని నిరూపించిందో జంట. స్కూల్ డేస్ నుంచీ ప్రేమించుకున్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరినీ చూసినవారు.. శభాష్ అని మెచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటే.. అతనికి మరగుజ్జు. ఈ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది. అంతేకాదు.. ట్విస్ట్ ఏంటంటే ఇది మతాంతర వివాహం. ఆమె ముస్లిం అయితే అతను హిందువు. తమకు రక్షణ ఇవ్వాలని కోరుతూ.. దంపతులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వివాహం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడు శశి జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగి. గౌసియా ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంద. కొన్నేళ్ల క్రితం కలిసి చదువుకున్న సమయంలో మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇరువురు ఇళ్లలో పెద్దలకు చెప్పగా.. గౌసియా పేరెంట్స్ అభ్యంతరం చెప్పారు. అందుకు అతని మరుగుజ్జుతనమే కారణమైంది. దీంతో గౌసినా అతనినే పెళ్లాడాలని నిశ్చయించుకుంది. కుటుంబ సభ్యుల్ని కాదని, అతనితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆపై తమకు రక్షణ ఇవ్వాలంటూ ఇనుగుదురుపేట పోలీసుల్ని ఆశ్రయించారు. ఇరుకుటుంబాల వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Next Story