- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర జిల్లా దొంగలు అరెస్టు
by Thanuru Gopichand |
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో, దిశ ప్రతినిధి, కోనసీమ జిల్లా : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు.అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 24న రాజోలులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారన్నారు. నిందితులను అరెస్టు చేసి, రూ. 40 లక్షల విలువైన 449 గ్రాముల బంగారం, 5925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఇద్దరు దొంగలను కోర్టుకి తరలించినట్లు వివరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసును చేధించిన కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ టీం ను ఎస్పీ అభినందించారు. కేసును చేదించిన, రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీం, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం పోలీసులకు రివార్డును అందజేశారు
Next Story






