- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ జిల్లా జూపూడి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాశ్ అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లా జూపూడి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు దేవినేని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అవినాశ్, మొండితోక జగన్మోహన్ రావు, పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ జిల్లా జూపూడి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ రావు, పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం జూపూడి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ మేరకు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో దేవినేని అవినాశ్, పలువురు పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. జోగి రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా వైసీపీ నేతలు మండిపడ్డారు.
Next Story






