- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప అల్మాస్‌పేట సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు
కడప అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కూడలికి 'టిప్పు సుల్తాన్' పేరు పెట్టడంపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: కడప అల్మాస్‌పేట సర్కిల్(Kadapa Almaspet Circle) పేరు మార్పు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కూడలికి 'టిప్పు సుల్తాన్'(Tipu Sultan) పేరు పెట్టడంపై ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అల్మాస్‌పేట సర్కిల్‌ను 'హనుమాన్ సర్కిల్'(Hanuman Circle)గా మార్చాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో అక్కడ హనుమాన్ సర్కిల్ పేరుతో బ్యానర్లు వెలియడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మాట మాట పెరిగి పరస్పరం రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లతో దాడులు చేసుకోవడంతో అల్మాస్‌పేట ప్రాంతం యుద్ధ ప్రాతిపదికన మారిపోయింది.
పోలీసులపైనా రాళ్ల వర్షం
ఈ ఘర్షణను అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఒక సీఐతో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఇరువర్గాల దూషణలు, కేకలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
అల్మాస్‌పేట పరిసరాల్లో 144 అమలు
ప్రస్తుతం అల్మాస్‌పేట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలు చేస్తూ ఆంక్షలు విధించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. వివాదాస్పద సర్కిల్ వద్ద ఇరువర్గాలను పంపించివేసి, పోలీసులు పహారా కాస్తున్నారు.






