- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YogAndhra 2025:ఆ జిల్లాలో వినూత్నంగా యోగాంధ్ర.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’ అత్యంత కీలకమైనది. రేపు జరగబోయే యోగాంధ్ర రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.ఈ క్రమంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత నెల(మే) 21వ తేదీ నుంచి యోగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొంటున్నారు. యోగాంధ్రలో భాగంగా విద్యార్థులు వినూత్న ప్రదర్శనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో నిన్న(గురువారం) జల యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జల యోగాంధ్ర అనే వినూత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ జల యోగాలో సుమారు 150 మంది యోగ సాధకులు పాల్గొన్నారు. నాగాయలంకలో ప్రతిరోజూ జల యోగా చేస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలో యోగ చేస్తున్న వారికి గుర్తింపు ఇస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. అంతేకాదు, జల యోగాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇవాళ నాగాయలంకలో జల యోగ కార్యక్రమం నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ప్రతి ఒక్కరు ఈ జలయోగా చేయోచ్చని కలెక్టర్ వివరించారు. ఈ క్రమంలో జల యోగాలో వికలాంగులు, విద్యార్థులు, వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక అధికారులు చురుకుగా పాల్గొన్నారు. ఈ యోగ చేస్తున్న వారిని చూస్తుంటే ఇండియాకు ఒలంపిక్‌లో అవార్డు తీసుకు వస్తారని నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఈ జలయోగా కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. 154 మంది గజ ఈతగాళ్లను గుర్తించి వారి ద్వారా నీటిలో యోగా ఆసనాలు వేయడం జరిగిందని జలయోగాలో పాల్గొన్న వారు తెలిపారు. ఈ కార్యక్రమం రేపు(జూన్ 21న) జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 26 జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలను రోజువారీ సెషన్‌లు, యోగా శిక్షణ మరియు అవగాహన డ్రైవ్‌ల ద్వారా నిమగ్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.






