అమానుషం.. 43 కుటుంబాల వెలివేత

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తోటపేట గ్రామంలో ఒక అమానుష ఘటన వెలుగుచూసింది....

అమానుషం.. 43 కుటుంబాల వెలివేత
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) తాళ్లరేవు మండలం తోటపేట గ్రామం(Thotapeta Village)లో ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. స్థానిక గ్రామ పెద్దలు ఏకంగా 43 కుటుంబాలను గ్రామం నుంచి వెలివేయడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. సామాజికంగా వారిని దూరం పెట్టడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గ్రామ పెద్దలు, 43 కుటుంబాల మధ్య విభేదాలు

కొంతకాలంగా గ్రామంలోని స్థానిక పెద్దలకు, ఈ 43 కుటుంబాలకు మధ్య తీవ్రమైన విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, తాము చెప్పిన పంచాయితీ మాటలకు, నిబంధనలకు ఈ కుటుంబాలు కట్టుబడి ఉండటం లేదనే నెపంతో గ్రామ పెద్దలు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వెలివేత కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు.

దిక్కుతోచని స్థితిలో బాధితులు

గ్రామ పెద్దల అనాగరిక చర్యతో దిక్కుతోచని స్థితిలో పడ్డ బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ సామాజిక బహిష్కరణ ఉదంతంపై జిల్లా అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి, జోక్యం చేసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు. తమకు గ్రామంలో స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story