సీఎం చంద్రబాబుతో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సమావేశం.. వేడుకలకు ఆహ్వానం

by Naga Rani Yarlagadda |

దుర్గగుడి పాలకమండలి చైర్మన్ రాధాకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న మహాకుంభాభిషేకానికి ఆహ్వానించారు.

సీఎం చంద్రబాబుతో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సమావేశం.. వేడుకలకు ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ) సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ మహాకుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావలసిందిగా రాధాకృష్ణ సీఎంను ఆహ్వానించారు. అలాగే మంత్రి నారా లోకేశ్ ను కూడా దుర్గగుడి పాలకమండలి ఆహ్వానించింది.

నేడు గ్రస్తోదయ చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దుర్గగుడిని కూడా ఉదయం నుంచి మూసివేశారు. ఆలయ సంప్రోక్షణ తర్వాత తిరిగి రేపు (బుధవారం) ఉదయం 8 గంటల తర్వాత దర్శనాలు పునః ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే మార్చి 6,7,8 తేదీల్లో మహాకుంభాభిషేకం జరగనున్న నేపథ్యంలో ఈనెల 9వ తేదీ వరకూ భక్తులకు అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story