భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. దెబ్బతో ఆ దర్శనాలు రద్దు

by Vemula.Srinu Prasad |

భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది...

భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. దెబ్బతో ఆ దర్శనాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawadad) వీధులు దసరా(Dasara) సంబురాలతో సందడిగా మారాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగురాష్ట్రాల(Telugu States) నుంచే కాదు.. కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర(Maharastra) నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కరఘాట్‌(PushkaraGhat)లలో స్నానం చేసి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. అమ్మవారికి పూజలు చేసి మొక్కులు కోరుకుంటున్నారు. దీంతో విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri) భక్తులతో కిక్కిరిసిపోయింది. సామాన్య భక్తులతో పాటు భవానీలు సైతం పోటెత్తారు. దాదాపు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. దుర్గమ్మ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టీటీడీ తరహాలో కంపార్ట్‌మెంట్ల వారీగా భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Next Story