దసరా ముగిసినా.. భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి

by Vemula.Srinu Prasad |

భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది...

దసరా ముగిసినా.. భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి
X

దిశ, వెబ్ డెస్క్: భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి(Indrakeeladri) మార్మోగుతోంది. దసరా మహోత్సవాల(Dussehra celebrations) ముగిసినప్పటికీ భవానీ భక్తుల(Devotees) ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారుజామునుంచి నైవేద్యం సమయం వరకు అమ్మవారిని 68,540 మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దీక్షా విరమణ చేసి ముందుకు సాగుతున్నారు. అయితే అంచనాలకు మించి భక్తులు వచ్చారు. దీంతో దేవస్థానం సిబ్బంది, పోలీస్, రెవిన్యూ, నగర పాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. భక్తులకు మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఉదయం అల్ఫాహారం అందజేశారు. 10 నుంచి అన్న ప్రసాదం ఏర్పాటు కొనసాగుతోంది. ఒక్కో భక్తుడికి రెండు లడ్డూ బాక్స్‌లు చొప్పున ప్రసాదం అందుబాటులో ఉంచారు.

Next Story