తిరుపతిలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

by Ajay Maddhiboyina |

తిరుప‌తిలో ఇండిగో విమానానికి ప్ర‌మాదం త‌ప్పింది. సాంకేతిక లోప‌తంతో 40 నిమిషాల పాటు విమానం గాల్లో చ‌క్క‌ర్లు కొట్టింది.

తిరుపతిలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుప‌తిలో ఇండిగో విమానానికి ప్ర‌మాదం త‌ప్పింది. సాంకేతిక లోప‌తంతో 40 నిమిషాల పాటు విమానం గాల్లో చ‌క్క‌ర్లు కొట్టింది. తిరిగి ఆ విమానం తిరుప‌తిలోనే సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలోనే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తరవాత పైలట్‌లు చాలా అప్రమత్తంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అహ్మదాబాద్ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగటంతో పైలట్లు చిన్న సమస్య వచ్చినా విమనాశ్రయంలోనే నిలిపివేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. నిన్న కూడా హైదరాబాద్‌లో థాయిలాండ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. టేకాఫ్ అయిన విమానాన్ని హైదరాబాద్‌లోనే ల్యాండ్ చేశారు.

Next Story