- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: 8 ప్లాట్‌ఫామ్‌లతో పెద్ద రైల్వే స్టేషన్.. 120 రైళ్లు వచ్చేలా భారీ ప్లాన్ !
మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వేశాఖ భారీ ప్లాన్ చేస్తోంది. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించా

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే శాఖ భారీ ప్లాన్ చేస్తోంది. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. అమరావతి మీదుగా ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో, 8 ఫ్లాట్ ఫామ్‌లో తో టెర్మినల్ నిర్మాణానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్ అభివృద్ధి చేయబోతున్నారు. దీంతో పాటు విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు కూడా చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలో మీటర్ల కొత్త రైల్వే కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా నిర్మించబోతున్నారు. ఇందులో ఎనిమిది రైల్వే లైన్లు అలాగే 8 ఫ్లాట్ ఫామ్ లు కూడా ఉంటాయి. ఈ స్టేషన్ గుండా 120 రైళ్ల రాకపోకలు జరిగేలా కూడా చర్యలు తీసుకోనున్నారు. ఈ మొత్తం టెర్మినల్ కోసం 300 ఎకరాలు అవసరం అవుతాయని అంచనాకు వచ్చింది రైల్వే శాఖ. ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని కూడా రైల్వే శాఖ కోరింది. అటు గన్నవరం రైల్వే స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ టెర్మినల్ గుండా 205 రైళ్ల రాకపోకలు ఉండేలా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టెర్మినల్ కోసం 143 ఎకరాలు అవసరం అవుతాయట.






