ఎన్టీఆర్ వర్థంతి వేడుకల్లో అసభ్యకర డ్యాన్సులు... మండిపడుతున్న నెటిజన్లు

by Ajay Maddhiboyina |

ఏపీలోని ఓ గ్రామంలో కూటమి నాయకులు ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు జరపగా అందులో రికార్డింగ్ డ్యాన్సులు సైతం ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ వర్థంతి వేడుకల్లో అసభ్యకర డ్యాన్సులు... మండిపడుతున్న నెటిజన్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆదివారం నటుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు వర్థంతి జరిగిన సంగతి తెలిసిందే. వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. చాలా ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా ఏపీలోని ఓ గ్రామంలో కూటమి నాయకులు ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు జరపగా అందులో రికార్డింగ్ డ్యాన్సులు సైతం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నెటిజన్లు వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.

వీడియోలో కొందరు మహిళలు అసభ్యకర రీతిలో డ్యాన్సులు చేస్తుండగా స్టేజిపై వెనకాల ప్లెక్సీలపై టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతల ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. అయితే వర్థంతి సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి కార్యక్రమంలో ఇలాంటి సెలబ్రేషన్స్ ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలోనూ రాష్ట్రంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించగా చాలా చోట్ల అసభ్యకరంగా ప్రవర్థించడంతో ఆ వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అధికారులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story