- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG BREAKING: ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వార్డులు పెంచుతూ జీవో జారీ
ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో డివిజన్లు/ వార్డులు పెంపు చేస్తూ జీవో జారీ చేసింది సర్కార్.

దిశ, వెబ్ డెస్క్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తులు మొదలుపెట్టింది ఏపీలోని కూటమి సర్కార్. ముందుగా చెప్పినట్లుగానే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్థానాలను పెంచేసింది. ఈ మేరకు రెండు జీవోలు MS 64,65 విడుదల చేసింది ఏపీ సర్కార్. జనాభా ప్రాతిపదికన వార్డులు/డివిజన్లను పెంచింది. ఇక ఈ పెంపుతో ఈ సారి పోటీదారులకు భారీ ఊరట లభించనుంది.
వార్డులు, డివిజన్ల స్థానాల పెంపుతో పోటీ చేసే ఆశావాహులకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న లోకల్ బాడీ ఎన్నికలలోపు వీటిని అమలు చేయబోతున్నారు. ఈ మేరకు కసరత్తులు చేసి, వార్డులు డివిజన్లను ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన అన్ని రూట్ మ్యాప్ సిద్ధం చేసారు. ఇందులో భాగంగానే.. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.






