- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిమాయత్ సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం
క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం మంగళవారం తెల్లవారుజాము నుంచి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్న అధికారులు, అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం మంగళవారం తెల్లవారుజాము నుంచి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్న అధికారులు, అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు, స్థానిక సంస్థలు, అలాగే జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. జలాశయాల గేట్ల నిర్వహణ, నీటి విడుదల (డిశ్చార్జ్) లేదా ఇతర అత్యవసర చర్యలకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకున్న వెంటనే అధికారిక ప్రకటనల ద్వారా ప్రజలకు, మీడియాకు సమాచారం అందజేయబడుతుందని జలమండలి స్పష్టం చేసింది.
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచనలు..
ఈ సందర్భంగా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, జంట జలాశయాల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సంబంధిత విభాగాలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అధికారుల సూచనలను పాటించాలని, అవసరమైతే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.






