ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరదలకు దెబ్బతిన్న ఆటో రిక్షాలకు పరిహారం పెంపు

by Jakkula.Mamatha |

గత ఏడాది ఆకస్మిక వరదలు(Floods) విజయవాడ(Vijayawada)ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరదలకు దెబ్బతిన్న ఆటో రిక్షాలకు పరిహారం పెంపు
X

దిశ,వెబ్‌డెస్క్: గత ఏడాది ఆకస్మిక వరదలు(Floods) విజయవాడ(Vijayawada)ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా బెజవాడ వాసులు తీవ్రంగా నష్టపోయారు. వరద నీరు కాలనీలను ముంచెత్తింది. దీంతో చాలా మంది కట్టుబట్టలతో మిగిలారు. వరదల్లో సర్వస్వం కోల్పోయారు. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వరద బాధితుల వాహనాలు, ఆస్తులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో 29 కంపెనీలు మునిగిన వాహనాల బీమా క్లెయిమ్స్ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

వరద బాధితులకు కూటమి ప్రభుత్వం(AP Government) పరిహారం ప్రకటించి.. వాళ్లకు అండగా నిలబడింది. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. గత సంవత్సరం(2024) ఆగస్టు-సెప్టెంబర్‌లో వరదల(Floods)కు దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.10 వేల పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నేడు(మంగళవారం) వరదల కారణంగా దెబ్బతిన్న ఆటోలకు పది వేల నుంచి రూ.20,000కు పెంచుతూ రెవెన్యూ శాఖ(Revenue Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిబంధనలు పక్కనపెట్టి ఉదారంగా పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులను ఆదేశించారు.

Next Story