కృష్ణా నదికి పెరిగిన వరద ప్రవాహం.. దుర్గా‌ ఘాట్‌లో తెప్పోత్సవం రద్దు

by Kema Shiva Kumar |

విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రీపై దేవీ శరన్నవరాత్రోవాలు అట్టహాసంగా కొసాగుతున్నాయి.

కృష్ణా నదికి పెరిగిన వరద ప్రవాహం.. దుర్గా‌ ఘాట్‌లో తెప్పోత్సవం రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రీపై దేవీ శరన్నవరాత్రోవాలు అట్టహాసంగా కొసాగుతున్నాయి. 10వ రోజు ఇవాళ మహా నవమి పర్వదినాన కననదుర్గా దేవి భక్తులకు మహిషాసుర మర్ధిని అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే, దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంస వాహన తెప్పోత్సవం ఈ ఏడాది అనూహ్యంగా రద్దు చేశారు. కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహణ అసాధ్యమని నీటి పారుదల శాఖ ఆలయ కమిటీకి సూచించింది. తెప్పోత్సవానికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతం కృష్ణా నదిలోకి వరద ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కులకు మించి ఉందని.. ఇది ఇంకా పెరిగి చాన్స్ ఉందని నీటీ పారదుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న క్రమంలో హంస వాహన తెప్పోత్సవాన్ని ఆలయ అధికారులు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Next Story