- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:పెరిగిన భక్తుల రద్దీ.. తిరుమల శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
by Jakkula.Mamatha |
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 72,860 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.2.98 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Next Story






