తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు

by Ajay Maddhiboyina |

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం 70,141 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చింది. అయితే ఇటీవలే పిల్లలకు ఎండాకాలం సెలవులు ముగిసిపోయిన సంగతి తెలిసిందే. సెలవులు పూర్తైనా తిరుమలకు మాత్రం రద్దీ తగ్గడంలేదు. మరోవైపు రేపు రెండో శనివారం కావడంతో కలిసి వస్తుందని భక్తులు భారీగా తరలివచ్చినట్టు కనిపిస్తుంది. శుక్రవారం దర్శనానికి వస్తే శనివారం, ఆదివారం కలిసి వస్తాయని భావిస్తున్నారు. సాధారణ భక్తులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం ఎక్కువగా శుక్ర, ఆదివారం మధ్యలోనే వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Next Story