- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో తగ్గిన రద్దీ.. 3 కంపార్టుమెంట్లలో భక్తులు
ప్రతిరోజూ ఎంతో రద్దీగా ఉండే తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ ఎంతో రద్దీగా ఉండే తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వర్షాల కారణంగానే తిరుమలకు భక్తుల రాక తగ్గినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. వారు స్వామివారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) వెల్లడించింది. కొత్తగా సర్వదర్శనం టోకెన్లు తీసుకుని క్యూలైన్లోకి వెళ్లేవారికి 6-8 గంటల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే టోకెన్లు లేనివారికి కూడా స్వామివారి దర్శనం 8 గంటల్లో జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది.
నిన్న 82,628 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 30,505 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. భారీవర్షాల నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.






