- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో ప్రవాసాంధ్రుల బ్రేక్ దర్శనాల కోటా పెంపు
తిరుమలలో ప్రవాసాంధ్రులకు శుభవార్త అందింది.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో ప్రవాసాంధ్రులకు శుభవార్త అందింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం సులభంగా లభించనుంది. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనం కోటాను 10 నుంచి 100కి పెంచారు. రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ(TTD)కి సీఎం చంద్రబాబు సూచించారు. అయితే ఏపీ ప్రవాసాంధ్రుల సోసైటి అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబును కలిశారు.
ఈ తరుణంలో గత ప్రభుత్వ హయాంలో తిరుమల(Tirumala)లో ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనం కోటాను 50 నుంచి 10 తగ్గించారని తెలిపారు. దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన సీఎం చంద్రబాబు(CM Chandrababu) తిరుమలలో ప్రవాసాంధ్రుల బ్రేక్ దర్శనాల కోటా పెంపుకు నిర్ణయం తీసుకున్నారు.
టికెట్లు బుక్ చేయడం..
*ప్రవాసాంధ్రులు ముందుగా APNRTS(Andhra Pradesh Non-Resident Telugu Society) వెబ్ సైట్ https://apnrts.ap.gov.in/లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం.
*తాము ఉంటున్న దేశాల వీసాలు, వర్క్ పర్మిట్‌ల వివరాలు నమోదు చేయాలి. *అనంతరం వెబ్‌సైట్‌లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన మూడు నెలల స్లాట్లు కనిపిస్తాయి. అందులో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ రోజు పరిస్థితులను బట్టి టీటీడీ టికెట్లను కేటాయిస్తుంది.
*టికెట్లు కేటాయింపు అయిన వారికి తిరుమలలోని APNRTSకు చెందిన పీఆర్వో ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. వివరాల కోసం ప్రవాసాంధ్రులు సంస్థ వెబ్‌సైట్ ద్వారా, ఫోన్ నంబర్ 0863 2340678 సంప్రదించవచ్చు.






