- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. కిరణ్ అరెస్ట్
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి(YS Bharatahi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త(TDP Follower) చేబ్రోలు కిరణ్(Chebrolu Kiran)పై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి(YS Bharatahi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త(TDP Follower) చేబ్రోలు కిరణ్(Chebrolu Kiran)పై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అరెస్ట్ కూడా చేయించింది. మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కిరణ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విజయవాడలోని ఇబ్రహీంపట్నం వద్ద అతడు ఉన్నట్టు గుర్తించి, అరెస్ట్ చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సొంత పార్టీ వారైనా సరే ఊరుకునేది లేదని టీడీపీ ఈ చర్య ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్టైంది. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ ను మంగళగిరి పీఎస్ కు తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ పెడతామని అధికారులు తెలియజేశారు. కాగా ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ అవడంతో కిరణ్ బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ.. సొంత పార్టీ నేతలె కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించడం గమనార్హం. మరోవైపు ఈ వ్యవహారంపై సామాన్య ప్రజలు, నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.






