- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pallenidra: స్వర్ణగ్రామం పేరుతో.. పల్లెనిద్ర
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ అధికారులు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

మంత్రులు, ఐపీఎస్అధికారులు నిర్వహించాలి
నెలకు మూడు రోజులు, రెండు రాత్రులు పల్లె నిద్ర తప్పనిసరి
ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దిశ డైనమిక్ బ్యూరో : మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ అధికారులు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సూచించారు. ఈరోజు క్యాబినెట్ భేటీ (Cabinet meating) అనంతరం ఆయన మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'స్వర్ణ గ్రామం' పేరుతో ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. ఉన్నతాధికారులు మూడు రోజులు, రెండు రాత్రులు నిద్ర చేయాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోవాలని స్పష్టం చేశారు. ఏపీ పథకాల్లో నాలుగోవంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్నారు. విశాఖ తీరాన ఉన్న,. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ను (Rushikonda) ఏం చేయాలి అనేదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాలోచన చేశారు. మంత్రులంతా రు షికొండ ప్యాలెస్ ను సందర్శించాలని సూచించారు. సందర్శించాక ఏం చేద్దామన్న అంశంపై మంత్రులు అభిప్రాయాలు చెప్పాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ (Paster Praveen) మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఈరోజు క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో మాట్లాడుతూ ప్రవీణ్ మృతి కేసును చేదించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయి అన్నారు. అన్ని కేసుల్లోనూ సీసీ కెమెరాలు (CC Cemera) ద్వారానే కీలక సాక్షాలు లభిస్తున్నాయని తెలిపారు.






