Mlc election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కూటమిదే హవా

by Thanuru Gopichand |

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి హవా చాటింది. పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించింది.

Mlc election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో..  కూటమిదే హవా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ (graduate mlc) ఎన్నికల్లో కూటమి హవా చాటింది. పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, (alapati raja) పీడీఎఫ్​అభ్యర్థి ఎంఎస్​లక్ష్మణరావు (lakshmanarao) మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుని రాజశేఖరం, (rajasekharam) స్వతంత్ర అభ్యర్థి వీర రాఘవులు మధ్య హోరీహోరీగా ప్రచారం నడిచింది. నిన్న ఉదయం ఓట్ల లెక్కింపు మొదలవగా తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఆలపాటికి లక్షా 45 వేల 57 ఓట్లు వచ్చాయి. లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనను విజేతగా ప్రకటించారు.

తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు అందిన సమాచారం మేరకు 28 టేబుళ్ళ 6వ రౌండు నాటికి 1,68,000 ఓట్లు లెక్కింపు పూర్తయ్యాయి. ఇందులో 1,53,182 ఓట్లు చెల్లాయి. 14,818 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 96,291 ఓట్లు రాగా.. పీడీఎఫ్(pdf)​ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు 35,614 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య 60,677 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు (srinivasilu naidu)విజయం సాధించారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ(raghuvarma) మీద ఆయన గెలుపొందారు.

Next Story