TTD:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక

by Jakkula.Mamatha |

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది.

TTD:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల(జూలై)15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అయితే.. తిరుమలలో ప్రతి ఏటా నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో ఆలయాన్ని శుద్ధి చేస్తారు.

ఈ తరుణంలోనే మంగళవారం(జులై 15) ఉదయం 6 గంటలకు తిరుమంజనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, బుధవారం(జులై 16) జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా ఉదయం 7 గంటలకు ఆలయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో మలయప్పస్వామి గరుత్మంతునికి అభిముఖంగా కొలువు చేస్తారు. ఈ నేపథ్యంలో మొదటిరోజు అష్టదళపాదపద్మారాధన మరుసటిరోజు కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Next Story