- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో YCP మూడో లిస్ట్.. ఆ 25 మందికి ఛాన్స్
ఏపీ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంచార్జుల మార్పుతో పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం అవుతుందో మరికొందరు తదుపరి జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన సీఎం జగన్ మూడో జాబితాను మరికాసేపట్లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూడో జాబితాలో మొత్తం 25 మంది పేర్లను పొందుపర్చినట్లు తెలుస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నియోజకవర్గాలకు వైసీపీ అధిష్టానం కొత్త ఇంచార్జిలను నియమిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి తుది కసరత్తులు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ సాయంత్రం మూడో లిస్ట్ విడుదల చేస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగులు, ఆశావహులు, నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎందురు చూస్తున్నారు.






