- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Govt: టీచర్స్ బదిలీలు, పదోన్నతలపై కీలక ప్రకటన
టీచర్స్ బదిలీలు, పదోన్నతలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..

దిశ, వెబ్ డెస్క్: టీచర్స్ బదిలీలు, పదోన్నతల(Transfers and promotions of teachers)పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ వేసవి సెలవు(Summer Holidays)ల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి జాబితాను రెడీ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తాజాగా కీలక ప్రకటన చేశారు. టీచర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ తమకు గుర్తుందని తెలిపారు. టీచర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా విద్యా వ్యవస్థను సైతం బలోపేతం చేస్తున్నామన్నారు. టీచర్ల బదిలీలకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. త్వరలోనే బదిలీల ప్రక్రియ చేపడతామన్నారు. అయితే టీచర్స్ బదిలీలకు సంబంధించి 2025 రెగ్యురేషన్ చట్టం ముసాయిదాను రూపొందించామని టీచర్స్ తమ ఫీడ్ బ్యాక్‌ను పంపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ సలహాలు, సూచనలు [email protected]కు ఈ నెల7లోపు మెయిల్ చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. సలహాలు, సూచనలు ఎలా పంపాలనేది వివరిస్తూ మేరకు ట్వీట్ చేశారు.
📢 Dear Teachers,📢
— Lokesh Nara (@naralokesh) March 1, 2025
In line with our commitment to a transparent and fair transfer process, we invite your valuable feedback on the Draft for Andhra Pradesh State Teachers Transfer Regulation Act, 2025 🏫✍. This initiative reflects our vision, as promised in the 2024 manifesto,…






