- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్.. వర్షాలపై ఐఎండీ కీలక అలర్ట్
దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు మండే ఎండలతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు ఎన్నికల హోరుతో దేశం వేడెక్కింది. ప్రత్యేకించి సోమవారం రోజు (మే 13న) తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరగబోతోంది. ఈనేపథ్యంలో దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త చెప్పింది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు తెలంగాణ, ఒడిశాలోని దక్షిణ ప్రాంతం, కర్ణాటక, కేరళ, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీయొచ్చని పేర్కొంది. పశ్చిమ హిమాలయాలలోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. తూర్పు భారతదేశంలో సోమవారం (మే 13) వరకు, మధ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో బుధవారం (మే 15) వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. బలమైన గాలులు, వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.