- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Alert:రాష్ట్ర ప్రజలకు IMD తీవ్ర హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకంది.

దిశ,వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెలలో కూడా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ(weather) పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ(Indian Meteorological Department) వెల్లడించింది.
రెండు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఉత్తర తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయంది. అనంతపురం, చిత్తూరు మినహా ఈ నెలలో సాధారణ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ పేర్కొంది. ఈ తరుణంలో ఏపీ(Andhra Pradesh)లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి(గురువారం) నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర , రాయలసీమలో పిడుగుల(thunderbolt)తో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA అధికారులు తెలిపారు.
ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఎండ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణంలో నెలకొంటున్న భిన్నమైన మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు సూచించారు.






