సిగ్గు, శరం ఉంటే అసెంబ్లీకి రండి.. వైసీపీపై ఎమ్మెల్యే గోరంట్ల ఫైర్

by Kema Shiva Kumar |

ఎన్నటికైనా.. మాజీ సీఎం జగన్ (Jagan) రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాక తప్పదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య (Gorantla Buchaiah Chowdary) చౌదరి అన్నారు.

సిగ్గు, శరం ఉంటే అసెంబ్లీకి రండి.. వైసీపీపై ఎమ్మెల్యే గోరంట్ల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నటికైనా.. మాజీ సీఎం జగన్ (Jagan) రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాక తప్పదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య (Gorantla Buchaiah Chowdary) చౌదరి అన్నారు. ఇవాళ ఆయన రాజమండ్రి (Rajahmundry)లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు పిరికిపందల్లా పారిపోతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడి.. వారి సమస్యలను పరిష్కరిస్తారని అసెంబ్లీకి పంపితే.. సభకు రాకుండా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ టైమ్‌పాస్ చేస్తున్నారని ఆరోపించారు.

ఐదేళ్ల వైసీపీ (YCP) పాలన చూసిన ప్రజలు జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని కామెంట్ చేశారు. సభకు వస్తే తాము చేసిన స్కామ్‌లు ఎక్కడ బయటపడతాయోనని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ వైపు చూడటం మానేశారని సెటైర్లు వేశారు. ఓ వైపు శాసన మండలికి హాజరుతోన్న సభ్యులు.. అసెంబ్లీకి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. చట్ట ప్రకారం 10 శాతం సీట్లు లేని వాళ్లకు ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఈడీ కేసులను ఎందుకు వాయిదా వేయించుకుంటున్నాడో ముందు జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.

Next Story